vangala rajeshwari: పాదయాత్రకు ముందు జగన్ కు షాక్... కాసేపట్లో టీడీపీలో చేరనున్న ఎమ్మెల్యే రాజేశ్వరి

  • ఫిరాయించనున్న రంపచోడవరం ఎమ్మెల్యే
  • ఇప్పటివరకూ మొత్తం 22 మంది చేరిక
  • 6న మరింతమంది రానున్నారంటున్న టీడీపీ
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర తలపెట్టి, తొలి అడుగులు వేస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మరి కాసేపట్లో ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఆమె ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు.

అసలు కొంతకాలం క్రితమే ఆమె పార్టీ మారతారని వార్తలు వచ్చినప్పటికీ, అవన్నీ ఒట్టి పుకార్లేనని రాజేశ్వరి ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాదయాత్రకు ముందు వైకాపా నేతలకు షాకిచ్చేలా మరోసారి టీడీపీ నేతలు పావులు కదపడంతో రాజేశ్వరి పార్టీ మారుతున్నారు. కాగా, ఇప్పటివరకూ టీడీపీలో 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేరారు. 6వ తారీఖున జగన్ పాదయాత్ర ప్రారంభించే రోజు మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
vangala rajeshwari
jagan
Telugudesam
babu

More Telugu News