mahith narayan: పూరీ ఇప్పుడు పెద్ద డైరెక్టర్ .. ఆయనని కలవడానికి నా కంటూ ఓ అర్హత ఉండాలి : చక్రి సోదరుడు

  • పూరీతో మంచి పరిచయం వుంది 
  • ఆయనను ఛాన్స్ అడగాలని వుంది 
  • అయితే దానికి ముందు నాకు సక్సెస్ లు రావాలి 
  • ఆ సక్సెస్ కోసమే వెయిటింగ్       
"పూరీ జగన్నాథ్ కి .. చక్రికి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలకి పనిచేశారు. అలాంటిది చక్రిగారు చనిపోయిన తరువాత మీరు పూరీ గారిని కలవలేదా?" అనే ప్రశ్న .. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మహిత్ నారాయణ్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను సంగీతాన్ని అందించిన 'నేనో రకం' పాటను పూరీగారు రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ను ఆయన హమ్ చేస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది" అని అన్నారు.

"అవకాశం ఇవ్వమని అడగడానికి ఆయనను తప్పకుండా కలుస్తాను. అయితే ఆయన ఇప్పుడు పెద్ద డైరెక్టర్ .. రెండు .. మూడు సక్సెస్ లు సంపాదించాక వెళ్లి ఆయనని కలిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. ఆ సక్సెస్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నా కంటూ ఓ అర్హత వచ్చాక ఆ పని చేయాలనుకుంటున్నాను. ఇప్పటివరకూ ఆయనని కలవక పోవడానికి కారణం ఇదే .. అంతకి మించి మరేం లేదు" అంటూ తన మనసులోని మాట చెప్పారు.      
mahith narayan

More Telugu News