Telugudesam: మేము గెలిస్తే...కేసీఆర్ ఇల్లు ప్రగతి భవన్ ను ఆసుపత్రిగా మారుస్తాం: రమణ

  • టీడీపీని బలోపేతం చేస్తాం
  • తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుంది
  • పార్టీ ఆవిర్భావం నుంచి సంక్షోభాలు, సమస్యలు ఎదురయ్యాయి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ఆసుపత్రిగా మారుస్తామని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీని బలోపేతం చేస్తామని అన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలని పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారని, ఆయన ఆదేశాల ప్రకారం నడుస్తామని ఆయన అన్నారు.

1982లో పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంక్షోభాలను, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నెగ్గుకొచ్చిందని ఆయన తెలిపారు. తమ పార్టీకి సమస్యలు కొత్త కాదని ఆయన అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మైండ్ గేమ్ తో ముందుకెళ్తున్నాయని, అయితే మాస్టర్ మైండ్ చంద్రబాబు తమతో ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పోరాడుతామని ఆయన తెలిపారు. 
Telugudesam
telangana
l.ramana
comments

More Telugu News