YSRCP: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్.. ఎల్లుండి నుంచే పాదయాత్ర!

  • వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్న జగన్
  • సోమవారం నుంచే ప్రజాసంకల్ప యాత్ర
  • ముమ్మర ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు
తాను చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ముందు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోవాలని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఇతర నేతలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.

వేంకటేశ్వరస్వామి దర్శనం పూర్తి కావడంతో జగన్ హైదరాబాద్‌ చేరుకుని అనంతరం కడప బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు సంకల్ప యాత్రకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. సోమవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుంది.
YSRCP
Jaganmohan Reddy
Tirupathi
Tirumala

More Telugu News