revant reddy: రేవంత్‌కు మంచి ప‌ద‌వి.. సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెలకు ఎమ్మెల్యే టిక్కెట్లు!: ఉత్త‌మ్ భరోసా

  • కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత‌ల‌కు ప్రాధాన్య‌త
  • రేవంత్‌రెడ్డికి 2019 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌లో మంచి పదవి
  • 'నాగం జ‌నార్ద‌న్ రెడ్డి కాంగ్రెస్‌లోకి' ప్ర‌చారంపై నో కామెంట్‌
త‌మ పార్టీలో చేరిన టీడీపీ నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ నుంచి త‌మ పార్టీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి 2019 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌లో మంచి పదవి దక్కుతుందని తెలిపారు. మిగ‌తా నేత‌లు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డిలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామ‌ని పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ లోకి వస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోన్న‌ నాగం జ‌నార్ద‌న్ రెడ్డి అంశంపై ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఆయ‌న చేరికపై తాను మాట్లాడలేనని తెలిపారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీకి త‌మ పార్టీయే ప్రత్యామ్నాయమని చెప్పారు.  
revant reddy
congress
utham

More Telugu News