akshar patel: రవిశాస్త్రి నాకు పెద్దగా సలహాలు ఇవ్వరు: అక్షర్ పటేల్
- శాస్త్రితో ఎక్కువగా మాట్లాడను
- నా బౌలింగ్ వైవిధ్యభరితంగా ఉంటుంది
- వికెట్లకు గురి తప్పకుండా బౌలింగ్ చేయమని మాత్రమే శాస్త్రి చెబుతుంటారు
హెడ్ కోచ్ రవిశాస్త్రితో తాను ఎక్కువగా మాట్లాడనని టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. ఆయన కూడా తనకు పెద్దగా సలహాలను ఇవ్వరని చెప్పాడు. తన బౌలింగ్ వైవిధ్యభరితంగా ఉంటుందని... అందుకే శాస్త్రి నుంచి సలహాలు తీసుకోవడానికి ఆస్కారం లేదని చెప్పాడు. రవిశాస్త్రి తనకు ఒకటే చెబుతుంటారని... జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డావో, మైదానంలో కూడా అంతే శ్రమించమని చెబుతుంటారని తెలిపాడు.
అయితే, ఒత్తిడికి గురైన సమయంలో బౌలింగ్ ఎలా చేయాలి? అనేదానిపైనే తాము మాట్లాడుకుంటామని చెప్పాడు. స్టంప్స్ కు గురి తప్పకుండా బౌలింగ్ చేయమని మాత్రమే శాస్త్రి తనకు చెబుతుంటారని అన్నాడు. తన బౌలింగ్ విధానంపై ఆయన ఎన్నడూ మాట్లాడలేదని చెప్పాడు.