gali janardhan reddy: గాలి ఆశలపై నీరు చల్లిన హైకోర్టు.. లండన్ వెళ్లడానికి అనుమతి నిరాకరణ!

  • లండన్ కు వెళ్లేందుకు అనుమతించాలంటూ గాలి పిటిషన్
  • అనుమతిస్తే మళ్లీ తిరిగిరాడన్న సీబీఐ
  • పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. లండన్ వెళ్లేందుకు అనుమతించాలంటూ గాలి పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లండన్ వెళ్లేందుకు అనుమతించాలని... పాస్ పోర్టును ఇప్పించాలంటూ గాలి పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... అనుమతిని నిరాకరించింది. విచారణ సందర్భంగా సీబీఐ తన వాదన వినిపించింది. గాలిని లండన్ కు అనుమతిస్తే... విజయ్ మాల్యా మాదిరి లండన్ నుంచి తిరిగిరారని వాదనలు వినిపించింది. 
gali janardhan reddy
cbi
ap highcourt

More Telugu News