sandeepkishan: మహేశ్ బాబు అందుకే సూపర్ స్టార్ అయ్యుంటారు!: సందీప్ కిషన్

  • 'కేరాఫ్ సూర్య'గా సందీప్ కిషన్ 
  • తాజా ఇంటర్వ్యూలో మహేశ్ ప్రస్తావన 
  • కొత్తదనానికి ఆయన ప్రాధాన్యతనిస్తారు 
  • ఆయన రూట్లో వెళతాను
సాధారణంగా ఒకటి రెండు ప్లాప్ లు ఇచ్చిన హీరోలకు అవకాశాలు రావడంలో ఆలస్యమవుతూ ఉంటుంది. అలాంటిది ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ కి చెప్పుకోదగిన హిట్ లేకపోయినా, తెలుగు .. తమిళ భాషల్లో ఆయనకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కేరాఫ్ సూర్య' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ మహేశ్ బాబు ప్రస్తావన తీసుకొచ్చాడు. "నాకు ఎంతో ఇష్టమైన హీరో మహేశ్ బాబు .. ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తగా కనిపించడానికీ .. కొత్తగా అనిపించడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. విభిన్నమైన పాత్రలను చేయడానికే ఆయన ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. ఈ కారణంగానే ఆయన సూపర్ స్టార్ అయ్యారేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందువలన నేను ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నాను .. ఆ మార్గంలో వెళుతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.  
sandeepkishan

More Telugu News