uttam kumar: అన్నా... గడ్డం ఎప్పుడు తీస్తావు?: ఎర్రబెల్లి ప్రశ్నకు ఉత్తమ్ సమాధానం ఇది!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ, ఈ ఉదయం లాబీలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ నేత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాబీలో వస్తుండగా, టీడీపీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఎదురు పడ్డారు. చాలా రోజులుగా ఉత్తమ్ తన గడ్డాన్ని పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

దాన్నే ప్రస్తావిస్తూ, "అన్నా, గడ్డం ఎప్పుడు తీస్తావ్?" అని ఎర్రబెల్లి ప్రశ్నించగా, "2019లో తీస్తాను" అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని, అప్పటిదాకా గడ్డం తీయబోనని, ప్రభుత్వ ఏర్పాటు తరువాతే షేవింగ్ చేయించుకుంటానని ఉత్తమ్ శపథం చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
uttam kumar
errabelli
assembly
lobbys

More Telugu News