ysrcp: వైఎస్ జగన్ తో 20 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడిన లగడపాటి!
- కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు వచ్చిన లగడపాటి
- పాదయాత్ర, పార్టీ వ్యవహారాలను గురించి చెప్పిన జగన్
- పెళ్లికి రాలేనన్న వైకాపా అధినేత
నిన్న తన కుమారుడి వివాహానికి వైకాపా అధినేత వైఎస్ జగన్ ను ఆహ్వానించేందుకు హైదరాబాద్ వచ్చిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, జగన్ తో 20 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. తాను చేపట్టిన పాదయాత్ర, పార్టీ వ్యవహారాల గురించి జగన్ వివరించగా, ఆసక్తిగా విన్న లగడపాటి, కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీలో రాజకీయాల గురించి వీరి మధ్య చర్చ సాగినట్టు సమాచారం. అయితే, లగడపాటి కుమారుడి వివాహం జరిగే 25వ తేదీన తాను పాదయాత్రలో ఉంటాను కాబట్టి పెళ్లికి రాలేనని, అన్యధా భావించవద్దని, తన తరఫున వేరెవరినైనా కచ్చితంగా పంపుతానని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.