sai srinivas: మెగా హీరోలతో పోటీపడుతోన్న మరో యంగ్ హీరో!

షార్ట్స్‌లో చూడండి
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన 'జవాన్' .. వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన వినాయక్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు.

అదే రోజున వరుణ్ తేజ్ మూవీని రిలీజ్ చేయనున్నట్టు ఆ సినిమా దర్శక నిర్మాతలు వెల్లడించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. మెగా హీరోలు ఇద్దరూ ఒకే రోజున వస్తుండటం గురించి అంతా మాట్లాడుకుంటుంటే, అదే రోజున థియేటర్లకు రావడానికి బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అవుతున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో శ్రీనివాస్ హీరోగా చేస్తోన్న 'సాక్ష్యం' సినిమా విడుదల తేదీగా ఫిబ్రవరి 9నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ముగ్గురు యంగ్ హీరోలు ఒకే రోజున రంగంలోకి దిగుతున్నారన్న మాట.          
Go Back to Shorts
sai srinivas

More Telugu News