narayana college: నా ఆడియో బయటకు వస్తుందని అనుకోలేదు: నారాయణ ఉద్యోగిని సరితా అగర్వాల్

  • వైరల్ అయిన ఆడియోపై స్పందించిన సరితా అగర్వాల్
  • నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నారాయణ ఉద్యోగిని
తాను ఓ ఫోన్ లో మాట్లాడిన మాటలు బయటకు వస్తాయని ఎంతమాత్రమూ అనుకోలేదని, ఈ విషయంలో తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించిన వారిపై పోలీసు కేసు పెట్టానని హైదరాబాద్, రామాంతపూర్ నారాయణ స్కూల్ ఉద్యోగిని సరితా అగర్వాల్ వెల్లడించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నవీన్ తో సరిత మాట్లాడిన ఫోన్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తనను ఇబ్బంది పెట్టాలని నవీన్ ఈ ఫోన్ ను విడుదల చేశాడని సరిత పోలీసు కేసు పెట్టారు. కాగా, నవీన్ రామాంతపూర్ లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. తన సెల్ ఫోన్ ను హ్యాక్ చేసి, రికార్డులను తస్కరించారని, తనను హత్య చేస్తారన్న భయం ఉందని ఆయన కూడా పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు నష్ట నివారణకు నారాయణ యాజమాన్యం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
narayana college
principal
ramantapur

More Telugu News