chandrababu: చంద్రబాబు, ఎల్.రమణ మాట్లాడుకుంటుంటే, రెండు చెవులేసి వింటున్న తెలంగాణ హోం మంత్రి... నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో ఇది!

  • గవర్నర్ ఇంట శుభ స్వీకార కార్యక్రమం
  • హాజరైన చంద్రబాబు, కేసీఆర్, ప్రముఖులు
  • పక్కపక్కన కూర్చున్న రమణ, చంద్రబాబు
  • వారి మాటలు వింటున్నట్టున్న నాయిని
తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మి చనిపోయిన తరువాత 13వ రోజు 'ఆదరింపు', 'శుభ స్వీకార' కార్యక్రమం జరుగగా, ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి పలువురు నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడ తీసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 ఓ సోఫాలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కూర్చుని మాట్లాడుకుంటుంటే, వెనక వరుసలో కూర్చున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన చెవులను రిక్కించి, వాళ్లేం మాట్లాడుకుంటున్నారో వింటున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు, రమణలు నాయినిని అంత ఆసక్తి కలిగించేలా ఏం మాట్లాడుకుంటున్నారోనని కామెంట్స్ వస్తున్నాయి.  ఆ ఫొటోను మీరూ చూడవచ్చు.
 
chandrababu
nayini
l ramana
kcr
governor

More Telugu News