jagan: లండన్ నుంచి వచ్చేసిన జగన్... మరో ఆరు నెలలు ఊపిరి సలపని బిజీ!

  • కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్లిన జగన్
  • నేడు సీబీఐ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ
  • రాత్రికి తిరుమలకు వెళ్లనున్న జగన్
  • దర్శనానంతరం రేపు తిరిగి హైదరాబాద్ కు
బ్రిటన్ లో చదువుతున్న తన కుమార్తెను చూసి వచ్చేందుకు లండన్ వెళ్లిన వైకాపా అధినేత వైఎస్ జగన్, హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. నేడు నాంపల్లి కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చారు. 6వ తేదీ సోమవారం నుంచి 'ప్రజా సంకల్ప యాత్ర'ను చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కోర్టు విచారణ ముగియగానే, తిరుమలకు బయలుదేరి వెళ్లి, తన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ వెంకటేశ్వరుని జగన్ దర్శించుకోనున్నారు.

నేటి రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటారని, రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుంటారని వైకాపా వర్గాలు తెలిపాయి. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితరులు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేదపండితుల వద్ద ఆశీర్వాదం తీసుకుని ఆయన తిరిగి హైదరాబాద్‌ వెళతారని పార్టీ నేతలు తెలిపారు.  
jagan
padayatra
court
tirumala

More Telugu News