amalapaul: రూ. 20 లక్షల పన్ను ఎగ్గొట్టడంపై స్పందించిన అమలాపాల్!

  • కోటి రూపాయల ఎస్-క్లాస్ బెంజ్ కారు కొన్న అమలాపాల్
  • 20 లక్షల పన్ను ఎగ్గొట్టిందంటూ ఆరోపణలు
  • కేసు నమోదు చేయమన్న కిరణ్ బేడీ 
  • ట్విట్టర్ ద్వారా స్పందించిన అమలాపాల్ 
కొన్న కారుకి 20 లక్షల రూపాయల పన్ను ఎగ్గొట్టిందంటూ తనపై వస్తున్న ఆరోపణలపై సినీనటి అమలా పాల్‌ స్పందించింది. నకిలీ అడ్రెస్‌ ప్రూఫ్‌ తో కోటి రూపాయల విలువ చేసే ఎస్‌-క్లాస్‌ బెంజ్‌ కారు కొనుక్కుందని, దీనికి ట్యాక్స్ 20 లక్షల రూపాయలు ఉంటుందని, ఈ మొత్తాన్ని ఎగ్గొట్టేందుకే ఆమె నకిలీ ప్రూఫ్ తో కారును కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ స్పందిస్తూ, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వీటిపై తాజాగా అమలా పాల్ తన ట్విట్టర్‌ ఖాతా వేదికగా స్పందిస్తూ..: ఈ నగర జీవితం నుంచి, అనవసరపు ఊహాగానాల నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. అందుకే, బోట్‌ రైడ్‌ కు వెళ్లాలనుకుంటున్నాను" అంటూ కామెంట్ చేసింది. ఇదిలా ఉంచితే, ఈ వ్యవహారంలో ఆమె ఎలాంటి తప్పు చేయలేదని పుదుచ్చేరి రెవెన్యూ, రవాణా శాఖ మంత్రి షాజహాన్‌ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆమె కారుకు సంబంధించిన అన్ని వివరాలు చట్టపరిధిలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
amalapaul
benz car
liran bedi

More Telugu News