Narayana: ఉద్యోగి శ్రీలత ఆత్మహత్య నేపథ్యంలో నేడు నారాయణ విద్యాసంస్థల బంద్‌!

  • పిలుపునిచ్చిన ఏబీవీపీ
  • జయసింహారెడ్డి అరాచకాలు ఎక్కువైపోయాయని ఆరోపణ
  • ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్
నేడు నారాయణ విద్యాసంస్థలు మూతపడనున్నాయి. మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతుండడమే కాకుండా హైదరాబాద్ నారాయణగూడలోని ఆ సంస్థ బ్రాంచ్ డీజీఎం జయసింహారెడ్డి వల్లే శ్రీలత అనే ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీహరి తెలిపారు. జయసింహా రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Narayana
Education
Institutions

More Telugu News