జగన్: వైఎస్ జగన్ ని కలిసిన లగడపాటి.. కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేత!
- జగన్ కు తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసిన లగడపాటి
- పాదయాత్ర కారణంగా రాలేనని చెప్పిన జగన్
- సుమారు అరగంట పాటు భేటీ
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడి పెళ్లి ఈ నెల 25న జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ని ఆహ్వానించే నిమిత్తం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు లగడపాటి ఈరోజు వెళ్లారు. జగన్ కు స్వయంగా శుభలేఖ అందజేసి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. అయితే, ఈ నెల 6 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుండటంతో తాను హాజరుకాలేనని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా, జగన్, లగడపాటి సుమారు అరగంట పాటు సమావేశమైనట్టు సమాచారం. ఈ సమావేశంలో జగన్ తో పాటు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు కూడా ఉన్నట్టు సమాచారం. లగడపాటి వెంట తిరువూరు నియోజకవర్గ నేత కావూరి విజయ్ కుమార్ ఉన్నారు.