కమలహాసన్ మానసిక స్థితి బాగోలేదు.. ఆస్పత్రిలో చేర్పించాలి: బీజేపీ
- హిందూ ఉగ్రవాదం పెరిగిందన్న కమల్
- ఆధారాలు లేకుండానే విమర్శలు చేస్తున్నారన్న బీజేపీ
- పరువు నష్టం దావాను పరిశీలిస్తున్న తమిళనాడు బీజేపీ
వివాదం వివరాల్లోకి వెళ్తే, దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని కమల్ ఆరోపించారు. ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గుజరాత్, యూపీ, రాజస్థాన్ లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పారు. ఈ మేరకు వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం దుమారం రేపుతోంది.
హిందూ సంస్థలు గతంలో హింసకు పాల్పడేవి కాదని, మాటలతోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేవని, ఇప్పుడు మాత్రం భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నాయని కమల్ తన కథనంలో పేర్కొన్నారు. హిందూ ఉగ్రవాదులను కొందరు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట వేడి పుట్టిస్తున్నాయి.