ram gopal varma: చరిత్రకు, పవన్ కొడుకు పేరుకు సంబంధం ఏంటి? తండ్రిని నిలదీసిన వర్మ కుమార్తె

  • పనిలేక ఇలాంటి పోస్టులా?
  • ఒక్క ముక్క కూడా అర్థం కాలేదన్న రేవతీ వర్మ
  • నీకసలు అర్థం చేసుకోవడమే రాదు
  • కుమార్తెపై వర్మ అక్షింతలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన నాలుగో బిడ్డకు పెట్టిన 'మార్క్ శంకర్ పవనోవిచ్' అన్న పేరు దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఆయన కుమార్తె మధ్య పెద్ద మాటల యుద్ధానికి కారణమైంది. ఈ పేరుకు, చరిత్రకు సంబంధాన్ని తెలుపుతూ, ఈ నేమ్ అతి గొప్పదని వర్మ కామెంట్ చేయగా, ఆయన కుమార్తె రేవతి వర్మ స్పందించింది.

ఈ పోస్టులో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని చెప్పింది. సామాన్యులకు అందని పదాలు వాడుతూ పోస్టులు చేయడాన్ని తప్పుబట్టింది. ఏం పనీలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆక్షేపించింది. చరిత్రకు, ఈ పేరుకు పొంతన ఎక్కడుందని నిలదీసింది. ఇక స్వతహాగా పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన తన కుమార్తె వ్యాఖ్యలను ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన వర్మ, సమాధానాన్నీ ఇచ్చాడు.

నీకసలు అర్థం చేసుకోవడం రానే రాదనే విషయం నువ్వు రాసిన కామెంట్ చూస్తేనే అర్థం అవుతోందని అక్షింతలు వేశాడు. మీ అందరికంటే పవన్ కల్యాణ్ ను తాను ఎక్కువగా ప్రేమిస్తున్నానని, తాను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని చెప్పాడు. ఈ సంభాషణను తన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.
ram gopal varma
pawankalyan
revati varma

More Telugu News