rajashekar: హీరో రాజశేఖర్ ఇంట మరో విషాదం... బావమరిది మృతి!

  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీ శ్రీనివాస్
  • ఈ తెల్లవారుఝామున కన్నుమూత
  • నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • ఇటీవలే మరణించిన రాజశేఖర్ తల్లి
హీరో రాజశేఖర్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఆయన తల్లి మరణించగా, ఆ బాధ నుంచి తేరుకోకముందే, ఈ తెల్లవారుఝామున జీవిత సోదరుడు, రాజశేఖర్ బావమరిది మురళీ శ్రీనివాస్ హైదరాబాదులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఆయన పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో ఉంచుతామని, ఆపై మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, రాజశేఖర్ నటించిన తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ' రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తల్లి మరణించిన బాధలో ఉన్న రాజశేఖర్, మనసు వికలమై ఓ యాక్సిడెంట్ కూడా చేశాడు.  
rajashekar
accident
brother in law
jeevita

More Telugu News