Pawan Kalyan: అన్నయ్య పేరు కలిసొచ్చేలా.. కుమారుడికి నామకరణం చేసిన పవన్ కల్యాణ్!

  • పవన్ కుమారుడి పేరులో వైవిధ్యం
  • సోషల్ మీడియాలో పేరుపై విపరీతంగా నడుస్తున్న చర్చ
  • కుమార్తె పూర్తి పేరు కూడా వెలుగులోకి
ఇటీవల మరోమారు తండ్రి అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కుమారుడికి పేరు పెట్టేశాడు. పవన్, అన్నా లెజినోవా దంపతులకు ఇటీవల పండంటి బాబు పుట్టాడు. ఆ బాబుకు పవన్ పెట్టిన పేరు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటనేగా.. ‘మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల’.. వినడానికి కొత్తగా, కొంత వింతగా ఉన్న ఈ పేరు గురించే ఇప్పుడు చర్చంతా.

పవన్ భార్య లెనిజోవా సంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటిస్తుంది. రష్యన్ ఆర్థోడక్స్ మత సంప్రదాయాలను పాటించే ఆమె తన బిడ్డ పేరు కూడా సంప్రదాయబద్ధంగానే ఉండాలని భావించిందట. క్రైస్తవంలో ‘మార్కస్’ అనే దేవుడికి సంక్షిప్త రూపంగానే తన బిడ్డ పేరుకు మొదట ‘మార్క్’ అని, చిరంజీవి అసలు పేరు నుంచి ‘శంకర్’ను, పవన్ పేరు నుంచి ‘పవనోవిచ్’.. వీటిన్నింటినీ కూర్చి ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ అని పెట్టారట.

ఇక పవన్, లెజినోవాల కుమార్తె పేరు కూడా పొలెనా అంజనా పవనోవా అట. అయితే ఆమె పొలెనా మాత్రమే అని అందరికీ తెలుసు. కుమార్తె పేరులోనూ పవన్ తన తల్లిపేరు ‘అంజన’ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ ప్రధానంగా నడుస్తోంది.
Pawan Kalyan
Tollywood
Janasena

More Telugu News