బీజేపీ నేత కిషన్ రెడ్డి: సచివాలయానికి సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చారో చెప్పాలి!: బీజేపీ నేత కిషన్ రెడ్డి
- వితండవాదం చేస్తున్న కేసీఆర్
- ప్రభుత్వ హాస్టళ్లు చాలా వరకు అద్దె భవనాల్లోనే!
- కొత్త సచివాలయం అంశంపై కిషన్ రెడ్డి విమర్శలు
కొత్త సచివాలయం నిర్మించి తీరుతానని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సచివాలయానికి సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త సచివాలయం నిర్మించి తీరుతానంటూ కేసీఆర్ వితండవాదం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లు చాలా వరకు అద్దె భవనాల్లోనే ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. కాగా, ఈ విషయమై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పందిస్తూ, కొత్త సచివాలయం నిర్మించే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.