pragathi: తనకి తల్లిగా నటించేది నేనని తెలిసి అనుష్క బాధపడింది : నటి ప్రగతి

  • కేరక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తొన్న ప్రగతి 
  • 'ఢమరుకం'లో అనుష్కకి తల్లిగా
  • అనుష్క అలా అనేసింది 
  • ఆమె చాలా మంచి మనిషి      
తెలుగులో చాలామంది కథానాయికలకు తల్లిగా ప్రగతి నటించారు. కొంతమంది సీనియర్ కథానాయికలకు కూడా ఆమె తల్లిగా కనిపించారు. అలా ఆమె 'ఢమరుకం' సినిమాలో అనుష్కకి తల్లిగా నటించారు. " 'ఢమరుకం' సినిమా షూటింగ్ సమయంలో తనకి తల్లి పాత్రను పోషించేది ప్రగతి అని తెలిసి అనుష్క చాలా బాధపడిందట .. నిజమేనా? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ప్రగతికి ఎదురైంది.

దాంతో ఆనాటి సంఘటనను గురించి ఆమె చెప్పుకొచ్చింది. " ఆ రోజు నేను సెట్స్ లోకి అడుగుపెట్టగానే .. అనుష్కకి తల్లిగా నటిస్తున్నది నేనేననే విషయాన్ని ఆమెకి డైరెక్టర్ చెప్పారు. "అయ్యో పాపం .. ఆవిడ నాకు అమ్మ ఏంటి ... ఒకసారి చూడండి ఎంత యంగ్ గా వున్నారో .. ఆమెను తల్లిగా ఎలా అనుకోగలను? అంటూ అనుష్క బుంగమూతి పెట్టేసింది. 'ఫరవాలేదు .. చేస్తాను .. నాకు ఓకే' అని నేను చెప్పాను. అనుష్క మంచి నటి .. నాకు తెలిసి అందరితో గుడ్ అనిపించుకున్న హీరోయిన్ తనే అయ్యుంటుందేమో"అంటూ ప్రగతి చెప్పుకొచ్చారు.      
pragathi

More Telugu News