'రోబో 2.0' మరో పోస్టర్... భయపెడుతున్న అక్షయ్ కుమార్ లుక్
- పోస్టర్లో కనిపిస్తున్న అక్షయ్ నటవిశ్వరూపం
- డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో
- ఆసక్తి పెంచుతున్న పోస్టర్
ఇప్పటికే 'డాక్టర్ రిచర్డ్స్' పాత్రలో అక్షయ్ కుమార్ లుక్, గెటప్ గురించి పోస్టర్లను విడుదల చేసినా... ఈ పోస్టర్లో అక్షయ్ పలికించిన హావభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినిమాలో అక్షయ్ నటవిశ్వరూపాన్ని చూపించాడనడానికి ఈ ఒక్క పోస్టర్ చాలని అభిమానులు అంటున్నారు.