రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన అనుచరులు.. 30 వాహనాల్లో హైదరాబాద్ పయనం!
- టీఆర్ఎస్ లో చేరనున్న కోస్గి ఎంపీపీ, వైస్ ఎంపీపీ
- ఈ సాయంత్రం టీఆర్ఎస్ లో చేరిక
- రేవంత్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారించిన టీఆర్ఎస్
టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం గులాబీ ఆకర్ష్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వివిధ పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇప్పటికే రేవంత్ అనుచరులను కొందరిని పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు కోస్గి మండలానికి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలు కూడా పార్టీలో చేరుతుండటంతో... రేవంత్ ఇలాఖాలో టీఆర్ఎస్ బలం మరింత పెరిగినట్టైంది.