విక్రమ్ కుమార్ ను అఖిల్ ఇబ్బంది పెట్టేశాడంటూ టాక్!
- విక్రమ్ కుమార్ తో అఖిల్ 'హలో'
- హైదరాబాద్ లో జరుగుతోన్న చివరి షెడ్యూల్
- డిసెంబర్ 22వ తేదీన విడుదల
అఖిల్ అన్ని విషయాల్లోను జోక్యం చేసుకుంటూ విక్రమ్ కుమార్ ను ఇబ్బంది పెట్టేశాడనేది ఆ వార్త సారాంశం. కథా కథనాల విషయంలోను .. పాత్రలను మలిచే విధానంలోను విక్రమ్ కుమార్ ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాంటిది .. పాటలు ఇలా ఉండాలి .. ఫైట్లు అలా ఉండాలి అంటూ విక్రమ్ కుమార్ కి అఖిల్ సలహాలు ఇచ్చాడట. ఆయన ధోరణి విక్రమ్ కుమార్ కి ఇబ్బందిని కలిగించడంతో నాగ్ దృష్టికి తీసుకెళ్లాడట. ఇందులో వాస్తవమెంతుందోగానీ .. ఇప్పుడిదే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.