roja: 'రోజా అక్కా, మీరు సూపర్' అంటూ కౌంటర్ ఇస్తున్న జనసేన మహిళా నేత వీడియో!

  • తలా తోకా లేని పార్టీలో చేరబోనన్న రోజా
  • అలాగే ఉండాలంటున్న జనసేన నేత
  • తమకు తలలు తప్ప తోకలు లేవని కౌంటర్
  • తిరుపతి యువతి వీడియో వైరల్
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తలా తోకా లేవని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ మహిళా కార్యకర్త ఒకరు మండిపడ్డారు. సుభాషిణి అనే మహిళా కార్యకర్త, రోజాను తీవ్రంగా విమర్శిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. సామాన్యులకు న్యాయం అందాలన్న ఉద్దేశంతో తమ నేత పవన్ కల్యాణ్ ఒక్కో అడుగూ వేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర కిడ్నీ సమస్యలపై, గుంటూరు జిల్లాలో రైతుల సమస్యలపై స్పందించారని గుర్తు చేశారు. రోజా తనకు సోదరి వంటిదని చెబుతూ, ఆమె అన్ పార్లమెంటరీ భాషను వాడుతున్నారని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

 "తప్పు జరిగితే ప్రశ్నించిన పార్టీ మాదే అక్కా. మా నాయకుడు పదవే కావాలంటే ఆయన కాళ్ల దగ్గరకు వస్తుంది. మోదీని కలవాలనుకుంటే, మీకు టైం ఇవ్వకపోవచ్చు. కానీ మా నాయకుడికి చిటికెలో ఇచ్చేస్తారు. ఎవరి దగ్గరికెళ్లి ఏదైనా సాధించే సత్తా మాకుంది. ఆ దమ్మూ, ధైర్యం నిజాయతీ కూడా మాలో ఉందక్కా" అని అన్నారు. తాను తలాతోకా లేని పార్టీలో చేరబోనని జనసేనను ఉద్దేశించి రోజా చెప్పడాన్ని గుర్తు చేస్తూ, "మీరు సూపర్ అక్కా. మీరు కరెక్ట్ గానే మాట్లాడారు. ఈ విషయంలో మీరు సూపర్. మీరు తలా తోక ఉన్న పార్టీల్లోనే ఉండండి. మాకు తలలే ఉన్నాయి. తోకలు లేవు" అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఆమె ఏమన్నారో ఈ వీడియోలో చూడవచ్చు.
roja
janasena
pawan
ysrcp

More Telugu News