amitab bachchan: ఐశ్వర్యా రాయ్ నుంచి రూ. 21 కోట్లు అప్పు తీసుకున్న అమితాబ్ బచ్చన్!

  • కుమారుడు అభిషేక్ నుంచి రూ. 50 కోట్ల అప్పు
  • తల్లి జయాబచ్చన్ కు రూ. 1.6 కోట్ల రుణమిచ్చిన అభిషేక్
  • అఫిడవిట్ లో వెల్లడించిన జయాబచ్చన్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తన కోడలు ఐశ్వర్యా రాయ్ నుంచి రూ. 21.4 కోట్ల అప్పు తీసుకున్నారట. అంతేనా, కుమారుడు అభిషేక్ నుంచి ఏకంగా రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన భార్య, పార్లమెంట్ సభ్యురాలు జయాబచ్చన్, తన అఫిడవిట్ లో ప్రాపర్టీ డిటెయిల్స్ లో తెలియజేశారు.

 భర్త ఆస్తిపాస్తుల వివరాలు అందించిన ఆమె, అమితాబ్ మొత్తం రూ. 104 కోట్ల అప్పులను చెల్లించాల్సి వుందని చెప్పారు. తాను కూడా అభిషేక్ నుంచి రూ. 1.6 కోట్లు రుణంగా పొందినట్టు తెలిపారు. తన ఆస్తుల విలువ రూ. 48 కోట్లని ప్రకటించారు. ఏడు పదుల వయసులోనూ బిజీగా ఉంటూ, రెండు చేతులా సంపాదిస్తూ, కోట్లకు పడగలెత్తిన అమితాబ్, కొడుకు, కోడలి నుంచి అప్పులు తీసుకోవడం ఏంటో మరి!
amitab bachchan
jaya bachchan
aishwarya rai
abhisheik

More Telugu News