Uttarpradesh: రామజన్మ‘భూమి’కి వారసుడిని నేనే.. యాకూబ్ హబీబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు!

  • బాబ్రీ మసీదు వివాదంలో కొత్త కోణం
  • ఆ భూమి తనదేనంటూ డీఎన్ఏ రిపోర్టు సహా ముందుకొచ్చిన యాకూబ్
  • భూమిని అప్పగిస్తే సమస్యను పరిష్కరిస్తానని బీరాలు
అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు-రామ జన్మభూమి స్థలం తనదేనంటూ యాకుబ్‌ హబీబుద్దీన్ అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొఘల్ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్‌కు తానే అసలైన వారసుడనని, అందుకు ఇదే సాక్ష్యమంటూ డీఎన్ఏ రిపోర్ట్‌తో మీడియాకు ఎక్కాడు.

బాబ్రీ మసీదు బాబర్‌ది అని, మొఘల్ వంశస్థులకు తాను వారసుడిని కావడంతో ఆ స్థలం తనకే దక్కుతుందని సరికొత్త వాదన వినిపిస్తున్నాడు. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు తనను ముతవల్లీగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేస్తున్నాడు. తనను ముతవల్లీగా ప్రకటించకుంటే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించాడు.

అయోధ్యలోని వివాదాస్పద స్థలం తనకు అప్పగిస్తే ప్రస్తుతం నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిస్తానని పేర్కొన్నాడు. అయితే బాబ్రీ మసీదును 1992లో కూల్చి వేస్తే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్న మీడియా ప్రశ్నకు మాత్రం యాకుబ్‌ నీళ్లు నమిలాడు.
Uttarpradesh
Ram janma Bumi
Yakub Habibuddin

More Telugu News