పరుచూరి గోపాలకృష్ణ: మహాభారతంలోని ఆ వాక్యాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను: పరుచూరి గోపాలకృష్ణ

  • ఆయా హీరోలందరూ మాకు ఏదో రకంగా సాయపడ్డ వాళ్లే
  • అందుకే, ఆ జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నా
  • ‘పరుచూరి పలుకులు’కి స్పందించకపోయినా నేను బాధపడను
  •  ఒక హీరో గురించి మరో హీరో అభిమానులు కామెంట్స్ చేయొద్దు
  • ఇది నా విన్నపం: పరుచూరి గోపాలకృష్ణ
సామాజిక మాధ్యమాల ద్వారా తమకు వస్తున్న నోటిఫికేషన్లను చూస్తున్నానని, ఈ సందర్భంగా తన ‘పరుచూరి పలుకులు’ వీక్షించే వారికి ఓ మాట చెప్పదలచుకున్నానని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘మహాభారతంను నేను పదిసార్లు చదివాను. అందులో ఒక వాక్యాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను.

‘ఎవరి మూలంగా నువ్వు పైకి వచ్చావో, సాయం పొందావో అటువంటి వాళ్లను కనుక మర్చిపోతే, నువ్వు చనిపోయిన తర్వాత నీ శవాన్ని కుక్క కూడా తినదు’ అని ఆ వాక్యం అర్థం. సినీ ఇండస్ట్రీలో ఆయా హీరోలందరూ మాకు ఏదో రకంగా సాయపడ్డ వాళ్లే. కాబట్టి, వాళ్ల యొక్క గొప్ప జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను. మిత్రులారా! సన్నిహితులారా! ఆత్మీయులారా! విద్యార్థులారా! యువతీ యువకులారా!..

మీరు, ‘పరుచూరి పలుకులు’కి స్పందించకపోయినా నేను బాధపడను కానీ, ఒక హీరో గురించి మరో హీరో అభిమానులు దయచేసి కామెంట్స్ చేయొద్దు. ఆ కామెంట్స్ ని నా ఛానెల్ లో మాత్రం పెట్టకండి! ఇది నా విన్నపం. ఎందుకంటే, అందరి హీరోల మీద మాకు గౌరవభావం ఉంది. మీరు కూడా అలానే గౌరవభావంతో ఉండండి’ అని కోరారు.
పరుచూరి గోపాలకృష్ణ
పరుచూరి పలుకులు

More Telugu News