అందుకే అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాం: విజయరమణారావు, సీతక్క
- టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచి, ఆ పార్టీ నేతలను అధికారం నుంచి తప్పిస్తాం
- ప్రజల కోసం ఒక బలమైన వేదిక కావాలి
- అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్లోకి వచ్చేశాం.. ఇంకా చాలా మంది వస్తారు
ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరిన సీతక్క మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడతామని చెప్పారు. తెలంగాణలో టీడీపీని లేకుండా చేయడానికి టీఆర్ఎస్ కుట్ర పన్నిందని అన్నారు. ప్రజల కోసం ఒక బలమైన వేదిక కావాలని, అందుకే తాము తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్లో చేరామని చెప్పారు.