revanth reddy: మా పార్టీని వదిలిన దెయ్యం.. కాంగ్రెస్ పార్టీని పట్టింది: రేవంత్ పై రమణ సెటైర్

  • టీడీపీ కార్యాలయాన్ని వదిలిన దెయ్యం.. కాంగ్రెస్ పార్టీని పట్టింది
  • కొడంగల్ లో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తాం
  • మా కార్యక్రమాలను రేవంత్ హైజాక్ చేశాడు
కాంగ్రెస్ కొత్త నేత రేవంత్ రెడ్డిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మరోసారి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనే దెయ్యం తమ అధినేత చంద్రబాబుకు దగ్గరై... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు గ్రహణంలా పట్టిందని అన్నారు. టీడీపీ కార్యాలయానికి పట్టిన ఆ గ్రహణం ఇప్పుడు తొలగిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఆ దెయ్యం పట్టిందని సెటైర్ విసిరారు.

 మార్చి 29 తర్వాత రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను కూడా రేవంత్ హైజాక్ చేశారని... రైతుపోరు, విద్యార్థి పోరుయాత్ర కార్యక్రమాలు తమవేనని చెప్పారు. 
revanth reddy
tTelugudesam
l ramana
chandrababu
ap cm

More Telugu News