ram: 'ఉన్నది ఒకటే జిందగీ' మూడు రోజుల వసూళ్లు

షార్ట్స్‌లో చూడండి
రామ్ .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'ఉన్నది ఒకటే జిందగీ' .. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'నేను శైలజ' హిట్ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది. లావణ్య త్రిపాఠి .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, యూత్ ను బాగా ఆకట్టుకుంది.

తొలి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.63 కోట్లు వసూలు చేసింది. ఇక మొదటి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 9.13 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 10.93 కోట్ల షేర్ ను వసూలు చేసింది. స్నేహం .. ప్రేమ నేపథ్యంలో రూపొందడం వలన ఈ కథాంశం యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అందువలన వసూళ్ల పరంగా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోందని అంటున్నారు. రామ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ సెట్ అయిన తీరు చూస్తే, ఆయన తదుపరి సినిమాల్లోను ఆమె ఛాన్స్ కొట్టేయడం ఖాయమని చెబుతున్నారు.         
Go Back to Shorts
ram
anupama

More Telugu News