revant reddy: రేవంత్ వెంట... మిగతా జిల్లాల నుంచి టీడీపీ నేతలు, రంగారెడ్డి జిల్లా నుంచి టీఆర్ఎస్ నేతలు!

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న అనుముల రేవంత్ రెడ్డి వెంట పలు జిల్లాల తెలుగుదేశం నేతలు నడుస్తుండగా, రంగారెడ్డి జిల్లా నుంచి మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు నేతలు రావడం గమనార్హం. జిల్లాకు చెందిన జడ్పీటీసీ సభ్యులు చింపుల శైలజ సత్యనారాయణరెడ్డి, ముంగి జ్యోతి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి రేవంత్ వెంట వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇక మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్క తదితరులకు టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి ఆహ్వానాలు వెళ్లినట్టు సమాచారం. టీఆర్ఎస్ నుంచి లభించిన భరోసాతోనే ప్రస్తుతానికి వీరు తెలుగుదేశం పార్టీలో ఉంటామని చెబుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి మాత్రం తన కార్యకర్తలతో సమావేశమై, రెండు రోజుల్లో ఏ విషయమూ చెబుతానని అన్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇదే మాట చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Go Back to Shorts
revant reddy
congress
rangareddy dist

More Telugu News