అచ్చెన్నాయుడు: ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై దృష్టి సారించాం: మంత్రి అచ్చెన్నాయుడు
- బస్సులకు ఏటా సామర్థ్య పరీక్షలు
- డ్రైవర్లకు ఏటా నైపుణ్య శిక్షణ
- కార్మికులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం
- మీడియాతో అచ్చెన్నాయుడు
ఇటీవల జరుగుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై దృష్టి సారించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, బస్సులకు ఏటా సామర్థ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, 12 లక్షల కంటే ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సులు 10 శాతం ఉన్నాయని, డ్రైవర్లకు ఏటా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, కార్మికులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఆర్టీసీ బస్సులు తిరిగే మార్గాల్లో రహదారులు సరిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, వచ్చే నెల నుంచే ఆర్టీసీలో జీరో శాతం ప్రమాదాలు నమోదయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఆర్టీసీ సిటీ బస్సు ప్రమాదం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ కంగారుపడటమే కారణమని, సాంకేతిక సమస్యలు పరిష్కరించాకే డ్రైవర్ కు బస్సు అప్పగించామని, పాత బస్సుల స్థానంలో వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు.