alia bhatt: ఆలియా భ‌ట్‌కి వ్యాయామ‌ శిక్ష‌కురాలిగా మారిన క‌త్రినా కైఫ్‌... వీడియో చూడండి

  • విధుల‌కు హాజ‌రు కాని ఆలియా, క‌త్రినాల‌ శిక్ష‌కురాలు
  • ఆలియాతో స్క్వాట్స్ చేయిస్తున్న క‌త్రినా
  • ఇన్‌స్టాగ్రాంలో వీడియో పోస్ట్ చేసిన క‌త్రినా
బాలీవుడ్ న‌టీమ‌ణుల మ‌ధ్య చ‌క్క‌ని స్నేహం ఉంటుంద‌ని న‌టి క‌త్రినా కైఫ్ త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ వీడియోలో మ‌రో న‌టి ఆలియా భ‌ట్‌కి క‌త్రినా వ్యాయామ శిక్ష‌కురాలిగా అవ‌తార‌మెత్త‌డం చూడొచ్చు. వీరిద్ద‌రూ క‌లిసే జిమ్‌లో శిక్ష‌కురాలు యాస్మిన్ క‌రాచీవాలా విధుల‌కు హాజ‌రుకాక‌పోవ‌డంతో ఆలియాతో క‌త్రినా స్క్వాట్స్ చేయించింది. వీడియోకు క‌త్రినా పెట్టిన వివ‌ర‌ణ ఆధారంగా చూస్తే ఆలియాతో 300ల స్క్వాట్స్ చేయించేందుకు క‌త్రినా సిద్ధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. వీడియోలో 100 నుంచి 109 వ‌ర‌కు క‌త్రినా లెక్క‌పెట్ట‌డం చూడొచ్చు. అలాగే మ‌ధ్య మ‌ధ్య‌లో ఆలియాను ప్రోత్స‌హించ‌డం, బ‌రువులు మోయ‌లేక ఆలియా క‌ష్ట‌ప‌డుతుండ‌టం క‌నిపిస్తోంది.
alia bhatt
katrina kaif
yasmin karachiwala
instagram
video
gym trainer

More Telugu News