revant reddy: ఆరు నెలల నుంచే కథ నడిపిన రేవంత్ రెడ్డి: ఎల్ రమణ సంచలన వ్యాఖ్యలు

  • ఇప్పుడు క్లైమాక్స్ కు తీసుకొచ్చారంతే
  • ఏప్రిల్ నుంచి కాంగ్రెస్ కు టచ్ లో రేవంత్
  • రాహుల్ ను కలిసొచ్చిన తరువాత కాంగ్రెస్ నేతల వద్ద ప్రాధేయపడ్డ రేవంత్
  • ఎల్ రమణ విమర్శలు
తాను పార్టీ మారాలని ఆరు నెలల ముందు నుంచే రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించుకున్నారని, అప్పటి నుంచే కథ నడిపి, ఇప్పుడు దాన్ని క్లైమాక్స్ కు తీసుకు వచ్చారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలుగా రేవంత్ కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారని, రేవంత్ ను ఆహ్వానించే విషయంలో మిగతా నాయకుల అభిప్రాయాలను స్వీకరించే నెపంతో కాంగ్రెస్ పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసివచ్చిన తరువాత, ఆయన తనను వ్యతిరేకిస్తున్న డీకే అరుణ, కోమటిరెడ్డి వంటి వారి దగ్గరికెళ్లి ప్రాధేయపడ్డారని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీని వీడాలని ఆయన ఎంతో ముందుగానే అనుకున్నారని, కాంగ్రెస్ కాకుంటే మరో పార్టీలోకి మారుండేవారని అన్నారు.
revant reddy
congress
l ramana
Telugudesam

More Telugu News