తేజ 'ఎన్టీఆర్ బయోపిక్'లో చంద్రబాబు, హరికృష్ణ వీరే!
- తేజ సంప్రదింపులు జరిపారంటూ వార్తలు
- సరిగ్గా సరిపోతారంటున్న టాలీవుడ్ వర్గాలు
- అధికారికంగా ఇంకా వెల్లడించని తేజ
చంద్రబాబునాయుడి పాత్ర కోసం జగపతిబాబును, ఎన్టీఆర్ కుమారుడిగా, ప్రజల్లోకి వెళ్లినప్పుడల్లా వెన్నంటి ఉంటూ, ఆయన వాహనాన్ని స్వయంగా నడిపిన హరికృష్ణగా కల్యాణ్ రామ్ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో తేజ నుంచిగానీ, నిర్మాత బాలయ్య నుంచిగానీ అధికారిక సమాచారం రాకున్నా, వీరిద్దరి పేర్లూ బయటకు వచ్చినప్పటి నుంచి ఇద్దరూ సరిగ్గా సరిపోతారని మాత్రం ఫిలింనగర్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.