chandrababu: నేటి ఢిల్లీ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్న చంద్రబాబు

  • మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సిన చంద్రబాబు
  • నితిన్ గడ్కరీతో చర్చలు జరపాల్సిన బాబు
  • ఆపై ఎన్వీ రమణ కుమార్తె రిసెప్షన్ కు
  • తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రోగ్రామ్ రద్దు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి తన ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాల్సిన ఆయన కార్యక్రమం రద్దయిందని సీఎం కార్యాలయం వెల్లడించింది. వాస్తవానికి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుని, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలతో సమావేశమై, పోలవరం నిధులు, కడప ఫాతిమా మెడికల్ కాలేజీ సీట్ల అంశాలను ఆయన చర్చించాల్సి వుంది.

ఆపై జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తె వివాహ రిసెప్షన్ కు కూడా వెళ్లి, ఆపై రాత్రికి అమరావతికి రావాల్సి వుంది. పార్టీ తెలంగాణ విభాగంలో నేతల వరుస రాజీనామాల నేపథ్యంలోనే బాబు తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ పర్యటన ఏ కారణంతో రద్దయిందన్న విషయమై సీఎం కార్యాలయం ఎటువంటి అధికారిక వివరణా ఇవ్వకపోవడం గమనార్హం.
chandrababu
delhi tour
cancel

More Telugu News