revant reddy: కాసేపు మాట్లాడుకుందామన్న రేవంత్ రెడ్డి... ఇంకేం మిగిలిందన్న చంద్రబాబు!

  • రాజీనామా లేఖను ఇచ్చేముందు చంద్రబాబుతో మాట్లాడాలని కోరిన రేవంత్
  • ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్ నేతలను కలవడం తనకు తెలుసునన్న చంద్రబాబు
  • మాట్లాడటానికి ఏమీ మిగల్లేదంటూ నిరాకరించిన ఏపీ సీఎం
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తరువాత నిన్న అమరావతికి రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలో ఆయనతో ఏకాంతంగా మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను డైరెక్టుగా చంద్రబాబుకే ఇవ్వాలని భావించిన ఆయన, చివరిగా కాసేపు ఆయనతో మాట్లాడాలని భావించి, అందుకు అవకాశం ఇవ్వాలని స్వయంగా ఆయన్నే కోరారట.

కానీ, రేవంత్ న్యూఢిల్లీకి వెళ్లడం, రాహుల్ గాంధీతో సమావేశమై జరిపిన చర్చలు, ఆపై కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు వంటి విషయాలన్నీ నిజాలేనని, అన్నింటికీ ఆధారాలుండగా, ఇంకా తనతో మాట్లాడేదేముందని వ్యాఖ్యానించిన చంద్రబాబు, రేవంత్ తో కలిసేందుకు నిరాకరించారట. ఆపై చేసేదేమీ లేక సీఎం కార్యదర్శికి తన రాజీనామా లేఖను ఇచ్చి, దాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించాలని చెప్పి వెళ్లిపోయారని తెలుస్తోంది.
revant reddy
congress
Telugudesam
chandrababu

More Telugu News