chandrananu: రేవంత్ రాజీనామా లేఖ నాకు అందలేదు.. ప్రెస్ మీట్ అయ్యాక మాట్లాడదాం ఉండమన్నాను!: చంద్రబాబు

  • మీడియా సమావేశం ముగిసిన తరువాత రేవంత్ తో మాట్లాడుతానన్నాను
  • అందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటాను
  • రేవంత్ రాజీనామా చేసిన విషయం నాకు తెలియదు
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ, రేవంత్ రాజీనామా లేఖ తనకు అందలేదని చెప్పారు. ప్రెస్ మీట్ తరువాత మాట్లాడదాం ఉండమని రేవంత్ రెడ్డికి చెప్పానని అన్నారు.

తాను విదేశాల నుంచి వచ్చిన తరువాత అక్కడ ఏం జరిగిందన్నది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే మీడియా సమావేశం పూర్తయిన తరువాత కలుద్దామని, అందర్నీ ఉండమని చెప్పానని ఆయన అన్నారు. మీడియా సమావేశం ముగిసిన తరువాత ఆయనతో మాట్లాడతానని ఆయన తెలిపారు. కాగా, మీడియా సమావేశం జరుగుతుండగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి, బయటకి వచ్చేయడం విశేషం. 
chandrananu
revanth reddy
Telugudesam
amaravathi

More Telugu News