mohan bhagavath: అమెరికన్ల కోసం అమెరికా.. అలాగే హిందువుల కోసం హిందుస్థాన్: మోహన్ భగవత్
- జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్
- హిందుస్థాన్ కేవలం హిందువుల కోసమే
- ఇతర మతస్తులు కూడా హిందూస్థాన్‌లో ఉండవచ్చు
- హిందువులు అంటే భారతమాత బిడ్డలు
హిందుస్థాన్ కేవలం హిందువుల కోసమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కాకపోతే ఇతర మతస్తులు కూడా హిందూస్థాన్‌లో ఉండవచ్చని వ్యాఖ్యానించారు. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ... హిందువులు అంటే భారతమాత బిడ్డలని అన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే వారంతా భారతీయులే అనడంలో అనుమానం ఏమీ లేదని అన్నారు.
సమాజంలోని అందరూ కలిసి తమవంతు పాత్ర పోషిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మోహన్ భగవత్ సందేశం ఇచ్చారు. 'జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్, అమెరికన్ల కోసం అమెరికా, అలాగే హిందువుల కోసం హిందుస్థాన్' అని ఆయన వ్యాఖ్యానించారు.