kanche ilaiah: హైదరాబాద్లోని కంచ ఐలయ్య ఇంటి వద్ద మోహరించిన ఏపీ, తెలంగాణ పోలీసులు
రేపు విజయవాడలో నిర్వహించతలపెట్టిన ప్రొ.కంచ ఐలయ్య సన్మానసభకు పోలీసుల నుంచి అనుమతి రాలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తార్నాకలోని కంచ ఐలయ్య ఇంటి వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించారు. కంచ ఐలయ్య ఇంట్లో నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన కంచ ఐలయ్య పోలీసుల చర్య అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. తనను అడ్డుకుంటే టీ మాస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తాము శాంతియుతంగా సభ నిర్వహిస్తామంటే పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.