pawan kalyan: త్రివిక్రమ్ చెప్పిన కథ విని ఎన్టీఆర్ కు సూటవుతుందని చెప్పి ఒప్పించిన పవన్ కల్యాణ్!

  • పవన్ కల్యాణ్ కు కథ చెప్పిన త్రివిక్రమ్
  • కథ నచ్చి తనకన్నా ఎన్టీఆర్ కు అయితే బాగుంటుందన్న పవన్
  • త్రివిక్రమ్ కు చెప్పి ఒప్పించాడని టాలీవుడ్ లో చర్చ
ఇటీవల ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైన సంగతి, ఆ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పవన్ తో సినిమా తీస్తున్న త్రివిక్రమ్, అది ముగియగానే పవన్ తోనే మరో చిత్రం తీసేందుకు రెడీ అయిపోయి, తాను సిద్ధం చేసుకున్న కథను వినిపించాడట.

కథ విన్న తరువాత, అది చాలా బాగుందని, అయితే, తనకన్నా, ఎన్టీఆర్ కు బాగా సూటవుతుందని చెప్పి, త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ ను కుదిర్చారట. పవన్ సలహా మేరకే ఎన్టీఆర్ ను తన ప్రాజెక్టులో త్రివిక్రమ్ భాగం చేసుకున్నారని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఓ స్టార్ హీరో కథ నచ్చిన తరువాత, తనకన్నా మరో హీరోకు నప్పుతుందని సలహా ఇవ్వడం ఇండస్ట్రీలో ఉన్న మంచి వాతావరణానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
pawan kalyan
trivikram srinivas
ntr

More Telugu News