chandrababu: రేవంత్ గురించి మాట్లాడవద్దని మోత్కుపల్లి, అరవింద్ లకు చంద్రబాబు క్లాస్

  • పదే పదే ఒకే విషయం ఎందుకు?
  • కొత్త విషయాలు చెప్పండి
  • నేతలపై చంద్రబాబు ఆగ్రహం!
నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో వాడివేడిగా జరుగుతున్న వేళ, రేవంత్ గురించి పదేపదే ఒకే విధమైన ఆరోపణలు చేస్తున్న పార్టీ నేతలు మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ గౌడ్ లను చంద్రబాబు మందలించినట్టు తెలిసింది.

మీరు చెబుతున్న విషయాలు, తరువాత చెప్పాలనుకుంటున్న విషయాలు తనకు తెలుసునని, కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలని, పదే పదే పాత మాటలే ఎందుకని చంద్రబాబు క్లాస్ పీకినట్టు సమాచారం. రేవంత్ ఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్ పెద్దలను కలిసి మాట్లాడుకుని వచ్చారని అరవింద్, ఆపై హైదరాబాద్ లో జరిగిన పరిణామాలపై మోత్కుపల్లి మాట్లాడబోగా, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
chandrababu
motkupalli
l ramana
revant

More Telugu News