anushka: మంచి స్క్రిప్ట్ దొరికితే మలయాళ సినిమాలు చేయడానికి రెడీ!: అనుష్క!

  • తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా అనుష్క
  • స్థాయికి తగ్గా పాత్రల కోసం వెయిటింగ్ 
  • మలయాళ సినిమాల గురించిన ప్రస్తావన
తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా అనుష్కకి ఎంతో క్రేజ్ వుంది. ఈ రెండు భాషల నుంచి వరుస అవకాశాలు వస్తున్నా, వెంటనే ఆమె ఒప్పుకోవడం లేదు. తన స్థాయికి తగిన సినిమాలు చేయడానికి మాత్రమే ఆమె ఆసక్తిని చూపుతోంది. ఇదే సమయంలో ఆమె మలయాళ సినిమాల గురించి మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

"భారతీయ చలనచిత్ర పరిశ్రమ తలెత్తుకునేలా మలయాళ సినిమా చేయగలదు.. అంటూ మా నాన్న ఓసారి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి" అని అనుష్క అంది. మలయాళ ప్రేక్షకులకు సినిమాలపై మంచి అవగాహన ఉందనీ .. అక్కడి సినిమాల్లో ఎంతటి కథాబలం వుంటుందనే విషయం తాను సినిమాల్లోకి వచ్చాక అర్థమైందని చెప్పింది. మలయాళంలో సినిమా చేయవలసి వస్తే ముందుగా దర్శకుడు ఎవరు? .. హీరో ఎవరు? అని చూస్తాను. ఈ ఇద్దరి విషయంలో అంతగా సంతృప్తి అనిపించకపోయినా, స్క్రిప్ట్ బాగుంటే చేసేస్తానని అంది. మొత్తానికి అనుష్క మనసు మలయాళ సినిమాలవైపు లాగినట్టే కనిపిస్తోంది కదూ.      
anushka

More Telugu News