Rahul gandhi: నా పెళ్లి విధిరాత.. ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది!: రాహుల్ గాంధీ

  • తాను విధిని నమ్ముతానన్న రాహుల్
  • ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుందని వ్యాఖ్య
  • వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలు వెల్లడి
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన చాంబర్ ఆఫ్ కామర్స్ 112వ వార్షిక సదస్సుకి హాజరైన రాహుల్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితానికి చెందిన పలు విషయాలను బయటపెట్టారు. ఇదే కార్యక్రమానికి హాజరైన బాక్సర్ విజేందర్ లేచి ‘రాహుల్.. మీ వివాహం ఎప్పుడు?’’ అని ప్రశ్నించాడు.

స్పందించిన రాహుల్.. అంతా ‘విధిరాత’ అని వ్యాఖ్యానించారు. తాను విధిని నమ్ముతానని, ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే విజేందర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తాను జపాన్ మార్షల్ ఆర్ట్స్‌కు చెందిన అకిడో విద్యలో నిష్ణాతుడినని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదని, వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. అకిడో విద్యలో ప్రావీణ్యం ఉందని రాహుల్ చెప్పగానే సభికులు ఆశ్చర్యపోయారు.
Rahul gandhi
congress
marriage
vijendar
delhi

More Telugu News