Kamal Haasan: ఆ రోజున కొత్త‌ పార్టీ ప్ర‌క‌ట‌న ఉండ‌దు.. ఆ వార్త‌ల్లో నిజం లేదు: క‌మ‌ల హాస‌న్

షార్ట్స్‌లో చూడండి
సినీ న‌టుడు క‌మల హాసన్ వచ్చేనెల‌ 7వ తేదీన పుట్టిన రోజు వేడుక జ‌రుపుకుంటోన్న సంద‌ర్భంగా అదే రోజున‌ రాజకీయ పార్టీ పెడ‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ వార్త‌ల‌పై క‌మ‌ల్ స్పందించారు. వ‌చ్చేనెల‌ 7వ తేదీన పార్టీ ప్రకటన ఉండబోదని తేల్చి చెప్పారు. త‌న‌ అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని స్ప‌ష్టం చేశారు. ఆ రోజున ప‌లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తానని చెప్పారు. మీడియాలో వ‌స్తోన్న కథనాలు నిజం కాద‌ని చెప్పారు. అభిమానులతో భేటీ కావడం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని ఆయ‌న తెలిపారు. 
Go Back to Shorts
Kamal Haasan
birthday

More Telugu News