chiranjeevi: మాస్ ఇమేజ్ నుంచి బయటికి రావద్దంటూ చిరూ సూచన .. అందుకే బోయపాటితో చరణ్!

  • మాస్ ఇమేజ్ కి దూరంగా వెళుతోన్న చరణ్ 
  • అది మంచిది కాదన్న చిరూ 
  • తండ్రి సూచన మేరకే బోయపాటికి ఓకే 
  • మాస్ సబ్జెక్ట్ పై బోయపాటి కసరత్తు    
కెరియర్ ఆరంభంలో మాస్ ఆడియన్స్ ను అలరించడానికి ఆ తరహా సినిమాలు ఎక్కువగా చేసిన చరణ్, ఈ మధ్య కాలంలో మాస్ ఇమేజ్ కి కాస్త దూరంగా వెళుతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువకావడానికే ఆయన ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాడు. మాస్ ఇమేజ్ ఒక హీరోను ఏ స్థాయిలో నిలబెడుతుందో తెలిసిన చిరంజీవి, చరణ్ వేస్తోన్న అడుగుల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారట.

కుటుంబ కథా చిత్రాలు .. 'ధ్రువ' తరహా స్టైలీష్ మూవీస్ చేయడం మంచిదే కానీ, మాస్ ఇమేజ్ నుంచి బయటకి రావడానికి ప్రయత్నించవద్దని చరణ్ కి చెప్పారట. 'రంగస్థలం' తరువాత ఆయన తప్పకుండా ఒక మాస్ సినిమా చేయవలసిన అవసరం ఉందని అన్నారట. అందువల్లనే బోయపాటితో సినిమా చేయడానికి చరణ్ అంగీకరించాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథపైనే బోయపాటి కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు.  
chiranjeevi
charan

More Telugu News