actress kavitha: టీడీపీకి బై.. బీజేపీకి జై కొట్టనున్న సినీ నటి కవిత!

  • బీజేపీలో చేరుతున్న కవిత
  • పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ
  • మహానాడులో అవమానించారనే బాధలో కవిత
కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న నటి కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరేందుకు ఆమె నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన మహానాడులో వేదిక మీదకు ఆహ్వానించకపోవడంతో ఆమె అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

పార్టీకి ఎంతో సేవ చేస్తున్న తనను మహానాడులో అగౌరవపరిచారంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత పార్టీతో ఆమె అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తో ఆమె నిన్న భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా లక్ష్మణే తెలిపారు. కవిత తనను కలిశారని, బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించేది బీజేపీనే అని ఆమె నమ్ముతున్నారని చెప్పారు.
actress kavitha
kavitha
Telugudesam
bjp

More Telugu News